కర్నూలు నగరంలో బంగారు వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఎన్.ఆర్.పేటకు చెందిన ఈజర్ అహ్మద్ (42) షరాబజార్లో బంగారు నగల తయారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఒక పంచాయతీలో అడ్డు చెప్పాడనే కోపంతోనే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు.సోమవారం రాత్రి రాధాకృష్ణ థియేటర్ సమీపంలో నమాజ్ ముగించుకుని వస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఈజర్ అహ్మద్ పై కత్తులతో దాడి చేశారు. మెడపై కత్తి దాడి చేయగా, అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని చేయి పూర్తిగా తెగిపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృ