ప్రకాశం జిల్లా దర్శి డివిజన్ పరిధిలో వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డి.ఎస్.పి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఇప్పటికే మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలను పెట్టి పూజలు చేసే కమిటీ సభ్యులకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల అనంతరం నిమజ్జనం కార్యక్రమం వరకు కమిటీ సభ్యులు బాధ్యత వహించి శాంతియుత వాతావరణం లో వేడుకలను జరుపుకోవాలన్నారు.