ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163 పై వరద నీరు వచ్చి చేరడంతో నేడు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షం కారణంగా వరదనీరు రహదారిపై వచ్చి చేరింది. గతంలో ఆ ప్రాంతంలో వరద నీరు ప్రవహించడానికి కాలువ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరిగి అభివృద్ధి కావడంతో, కాలువ కనుమరుగై పోయింది. దీంతో వరద నీరు ప్రవహించడానికి కాలువ లేకుండా పోయింది. దీంతో ప్రతి సారి వర్షం పడినప్పుడల్లా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది.