పుట్టి పెరిగిన స్వంత గ్రామానికి మేలు చేయాలనే ఉద్దేశంతో గ్రామం లో జడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం టిడిపి సీనియర్ నాయకుడు,తెలుగు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సి. నారాయణ.తన స్వంత 4 ఎకరాల భూమి ను విరాళంగా ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డిఈఈ విష్ణు వర్ధన్ రెడ్డి, ఆలూరు ఎం ఈ ఓ -2 చిరంజీవి రెడ్డి లు స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే స్థలాన్ని స్కూల్ పేరు మీదుగా రిజిస్టర్ చేసి విద్యాశాఖ అధికార్లకు అప్పగిస్తామని నారాయణ రెడ్డి తెలిపారు.