జగ్గంపేటలో ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం నిర్వహించే వారపు సంత, ఆర్టీసీ కాంప్లెక్స్ల పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు రద్దీగా ఉండే ప్రదేశాలలో నేరాలు జరగకుండా ఉండేందుకు, ప్రజలలో భద్రతా భావన కల్పించేందుకుగాను డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహించారని జగ్గంపేట సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.