సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయ బోధన తీరును పరిశీలించిన ఆయన విద్యార్థి మాదిరిగానే జీవశాస్త్ర పాఠ్యాంశాలను విన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు విద్యార్థుల ఉపాధ్యాయుల ఆదరణ కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కళారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.