ఏలూరులోని డీసీఎంఎస్ ఎరువుల దుకాణం పై లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. ఇండియన్ పటాస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన పటాస్ 50 కేజీలు బస్తాకు 1/2 కేజీకి పైగా వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు.. ఇటు జిల్లావ్యాప్తంగా చెన్నైకి చెందిన ఇండియన్ పటాస్ లిమిటెడ్ కంపెనీ ఎరువులను సరఫరా చేస్తుందని ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.