ఎంపీ వెంకట మిథున్ రెడ్డికి ఆక్రమ కేసు నుంచి బెయిల్ మంజూరై విముక్తి కలగాలని పీలేరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు పీలేరు సర్పంచ్ షేక్ హబీబ్ భాషా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. లిక్కర్ అక్రమ కేసు నుంచి ఎంపీ వెంకట మిథున్ రెడ్డి కి బెయిల్ రావాలని, ఆయురారోగ్యాలతో జైలు నుంచి బయటపడాలని, కడిగిన ముత్యంలా ప్రజల్లోకి తిరిగి రావాలని వేడుకుంటూ పీలేరు పట్టణంలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి వేడుకున్నారు.