ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న "చలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం కల్లూరు అర్బన్ పరిధిలోని షరీన్ నగర్‌లో జరిగిన మట్టిపని మేస్త్రీల సమావేశంలో కె.సుధాకరప్ప, జి.యేసు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.