గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం సినీ హీరో నారా రోహిత్ సందడి చేశారు. సుందరకాండ సినిమా విజయోత్సవం సందర్భంగా గుంటూరు వచ్చిన నారా రోహిత్ విద్యా నగర్లోని గణేష్ నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదలైన చిత్రం మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని నారా రోహిత్ తెలిపారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.