Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం సుందరయ్య భవన్లో బుధవారం ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే రామస్వామి అధ్యక్షతన గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలకు జీవో నెంబర్ 3 రక్షణగా ఉండేదని దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత దానికి సమాంతరమైన చట్టం తీసుకురావచ్చని చెప్పినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వున్నాయని అన్నారు జీవో నెంబర్ 3 లేకపోవడం వలన ఇవాళ గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు మైదాన ప్రాంతం కు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు.