ఆలూరు నియోజకవర్గం లో గత నెల 20వ తేదీన చిగిలి గ్రామంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.. మంగళవారం చిన్నారుల కుటుంబాలకు పదివేల రూపాయలు చొప్పున వారి కుటుంబాలకు అందజేయడం జరిగిందని ఆలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకప్ప తెలిపారు. ఈ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. అదేవిధంగా చిన్నారులు మృతి చెందిన ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.