శృంగవరపుకోట మండలంలో ఉన్న జిందాల్ భూపోరాట నిర్వాసితులు...న్యాయం జరగలేదంటూ తమ గళం విప్పేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దాదాపు 100 మంది గిరిజన రైతులతో కలిసి ఢిల్లీ బయలుదేరారు. రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమల్ని మోసం చేశారని, ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ వద్ద జరిగిన అన్యాయం తెలుపుతామన్నారు. ఢిల్లీలోనే తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.