కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల టి. చదివేవాండ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు "జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.అయితే ఈ ఏడాది అదే రోజున ఈద్-ఎ-మిలాద్ పండుగ కారణంగా పాఠశాలకు సెలవు ఉండటంతో ముందస్తు వేడుకలు నిర్వహించారు.ఇందులో భాగంగా హెచ్ఎం సి.రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల మధ్య క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు,వినోదాత్మక ఆటలు నిర్వహించగా, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనగా విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు