సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన కుక్కడపు మనోజు అనే విద్యార్థి స్నేహితులతో కలిసి చేపల వేటకు బుధవారం వెళ్ళాడు. ఈ సందర్భంగా తూములోకి జారిపడి గునాలోకి ఇరుక్కుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కోదాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న మనోజ్ వినాయక చవితి సెలవు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా చేపల వేటకు వెళ్లాడు .విద్యార్థి తండ్రి నాగేశ్వరరావు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.