సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాల్కి, చీకుర్తి, బీదర్ రోడ్డులో భారీ వరద రాగా, రేజింతల్ - ఎల్గోయి రోడ్డులో మామిడి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. బసంత్ పూర్ - మెటల్ కుంట రహదారిపై గల బ్రిడ్జి పై నుండి వాగు పొంగిపొర్లుతుండగా పోలీసులు, అధికారులు బుధవారం సాయంత్రం నీతి ఉధృతిని పరిశీలించి ఈ రహదారుల గుండా రాకపోకలను నిలిపివేశారు. వరద ఉధృతి అధికంగా ఉన్న దృశ్య ఎవరు నీటిని దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు.