ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై నేడు శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు భారతీయ జనతా పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించి, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా బిజేపీ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై మాట్లాడుతూ... దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.