సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో నార్సింగ్ లో జరగబోయే ఫోటో ఎక్స్పో గోడ పత్రిక మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 19 20 21 తేదీలలో నార్సింగ్ లో జరిగే ఫోటో ఎక్స్పో ను ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.భవిష్యత్ కాలంలో ఫోటో కెమెరాల అప్డేట్ వర్షన్, ఫోటో కెమెరాలకు సంబంధించిన ఎక్విప్మెంట్, ఆల్బమ్స్ ప్రింటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. డివిజన్ పరిధిలోని ఫోటో వీడియో గ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు