విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. శ్రీనివాస్, ఆర్.లింగరాజు, డి.ఎన్.వి.డి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసారు.