ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలను పారదర్శకతతో, నిర్ణిత గడువులోపు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ షణ్మోహన్.. జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసు, ఎస్ఎస్ఏ పీవో వేణుగోపాల రావు తదితర అధికారులు హాజరై, కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల న