రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్డులో రసూల్ (36)అనే వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు చిట్స్ నడిపేవాడు తెలిసింది. ఏడాదిన్నర క్రితమే వివాహం అయింది. మిలాద్ ఉన్ నబీ రోజనే ఇలా జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రసాద్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.