Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్ పేట దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తే చర్యలు చేపడతామని ఆత్మకూరు RDO బి.పావని, DSP K.వేణుగోపాల్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్ పేట దర్గా ప్రాంతంలో ఉండే వసతి గృహాలు, గెస్ట్ హౌస్, లాడ్జిల నిర్వాహకులు, కేర్ టేకర్స్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖాజానాయబ్ రసూల్ దర్గాకు బయట నుంచి వచ్చే వ్యక్తుల వివరాలను నమోదు చేయాలని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.