ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలోని రేగలగడ్డ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెంచుకున్న భర్త నారాయణ భార్యను రోకలి బండతో దాడి చేసి గొంతు కోసి హతమార్చాడు. తరువాత తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ లో పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.