నందిగామ కాన్హా శాంతి వనంలో సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ను మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జుడీసీఎల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారి ఇచ్చిన నివేదిక ద్వారా విషయాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి సిబిఐకి అప్పగించామని తెలిపారు. సిబిఐ దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని తెలిపారు.