మంగళవారం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలో అందిస్తున్న సదుపాయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డెన్ మాట్లాడుతూ వసతిగృహంలో ప్రహరీ గోడ చేపట్టాలని కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి జిల్లాలోని వసతి గృహాలలో సదుపాయాలతో పాటు మరమత్తు పనులు కూడా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.