శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలతో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తలతో మెలగాలని, నేర ప్రవృత్తికి స్వప్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితం గడపాలని పాత నేరస్తులను రౌడీషీటర్లకు తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా అల్లర్లు అలజడలు సృష్టిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.