కూసుమంచి మండలం నాయకనూడెం వద్ద ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన లారీ గొర్రెల మందను ఢీకొట్టడంతో ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రైతు చెట్ల శ్రీను తన గొర్రెలను మేతకు తీసుకొని వెళ్లి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తన జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో రైతు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు