మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5000/- జరిమానా బాధితురాలికి రూ.3,00,000/- నష్ట పరిహారంగా ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2024 సంవత్సరం నందు భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలో బాధితరాలి(08 సంవత్సరాలు) అమ్మమ్మ ఫిర్యాదు ప్రకారం, 08 సంవత్సరాల వయస్సు గల తన మనవరాలు వేసవి సెలవులకు ఆమె ఇంటికి వచ్చింది. తన మనవరాలితో కలిసి ఆవును మేపడానికి రాజు తోటకు వెళ్లిన సమయంలో ఆమె మనవరాలు పక్కనే ఉన్న రాజు ఇంటికి ఆడుకోవడానికి వెళ్లింది.