ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రముగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్. పి. రాజా బాబు చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టరుగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎన్.ఎస్.పీ. గెస్ట్ హౌస్ కు వచ్చిన కలెక్టరుకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డీఆర్వో చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రకాశం భవనముకు తోడుకొని రాగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు