పెద్ద కడబూరు: గ్రామంలోని జెడ్పీ పాఠశాలపై అసత్య ఆరోపణలు మానుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హనుమంతప్ప, సుధాకర్, సందీప్ ఎస్ఎఫ్ఎ నేతలకు హితవు పలికారు. ఆదివారం పెద్ద కడబూరులో వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీలు కాలం చెల్లాయని దుష్ప్రచారం చేయడాన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చిక్కీలు తయారు తేదీకి గడువు తేదీకి తేడా కూడా తెలియకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని తెలిపారు.