Parvathipuram, Parvathipuram Manyam | Dec 28, 2024
విద్యుత్ చార్జీలు పెంచారని వైసిపి నేతలు నిరసనలు తెలపడం విడ్డురంగా ఉందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు. వైసిపి ప్రభుత్వంలొనే 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. మీరు విద్యుత్ చార్జీలు పెంచి మీరే నిరసన తెలపడం హాస్యస్పదంగా ఉందన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై గత ప్రభుత్వంలో మేము కూడా నిరసన తెలిపామని గుర్తు చేస్తున్నామన్నారు. సొంత చెల్లె అన్న విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.