వడ్డేపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతి పశువుల కాపరి మూర్ఛ వ్యాధితో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామ శివారులో జరిగింది. శనివారం ఎస్సై శివ కుమార్ మాట్లాడుతూ శుక్రవారం పశువులను మేపడానికి వెళ్లిన వడ్డే వెంకటీ (40) ఇంటికి తిరిగి రాలేదు. మరునాడు శివారులో వెతికగా మూర్ఛ వ్యాధితో శివారులో పడి మృతి చెందాడు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.