ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. చిన్ననాటి నుంచే తెలుగు భాషపై పట్టు సాధించాలని సూచించారు. అనంతరం భాషా గొప్పతనాన్ని చాటుతూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.