కోడుమూరు పట్టణంలోని వెల్దుర్తి రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణం వెనుక భాగాన శనివారం సాయంత్రం యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఇదే మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన బోయగిరి హత్యకు గురయ్యాడు. హతుడు గిరి జెసిబి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. స్నేహితుడు మౌలాలి అతని సోదరుడు హుస్సేన్ హత్యకు పాల్పడ్డారని మృతుడి సోదరుడు అంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.