కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు.. యూరియా అందించకపోవడంతో నిరసన తెలిపారు. సొసైటీ సిబ్బందితో వాగ్వాదం చేశారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించాలని రైతుల కోరారు.