సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో రికార్డుల మెయింటెనెన్స్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, రికార్డులను తనిఖీ చేశారు. లాంగ్ పెండింగ్ కేసులు, ఎస్ బి డబ్ల్యు చేదనకు సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని డిఎస్పి కి సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చేవారి పట్ల ఓపికతో సమస్యను విని పరిష్కరించాలన్నారు.