గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో జరగడానికి యువతతో నేరుగా మాట్లాడుతూ పోలీసు ప్రజల సంబంధాలను మెరుగుపరచడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించి గణనాథుని సేవలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల గూడా, వినాయక చౌక్, బ్రాహ్మణవాడ, తిరుపెల్లి, శివాజీ చౌక్, శాంతినగర్ ప్రాంతాలలోని పలు ప్రధాన గణపతి మండపాలను దర్శించి గణపతి మండప కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడారు