అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకున్నామని అనంతపురం డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. నగర శివారులో ఏర్పాటు చేసిన భద్రత వల్ల నగరానికి వస్తున్న వారిని అడ్డుకొని అటునుంచే పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తమ ఆధీనంలో ఉందని తెలిపారు.