ఆశ డే సందర్భంగా గుంటూరు నగరంలోని బొంగరాల బీడు, శారదా కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ ,లాలాపేట లాంచెస్ రోడ్డు లోని అర్బన్ హెల్త్ సెంటర్లో జరిగిన సమావేశంలో మంగళవారం మధ్యాహ్నం యూనియన్ సిఐటియు నగర గౌరవ అధ్యక్షులు కే. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆశ లకు పారితోషకం రూపంలో వచ్చేవని, యూనియన్ పోరాట ఫలితంగా నేడు జీతం 10,000 రూపాయలు జీతం లభిస్తుందని అన్నారు. వీటితోపాటుగా ప్రసూతి సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇలా అనేక సౌకర్యాలు పోరాటాల ద్వారానే సాధించుకున్నామని అన్నారు.