కొమురం భీం అడ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం రెండు గేట్లను ఎత్తి 2,097 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243మీటర్లు కాగా ప్రస్తుతం 237 కు చేరుకుంది. ప్రస్తుతం అడ ప్రాజెక్టులోకి 2,250 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు