రంపచోడవరం నియోజకవర్గంలో ముంపు మండలాల్లో గత 20 రోజులుగా అనిశ్చిత పరిస్థితి నెలకొందని సిపిఐ చింతూరు డివిజన్ కార్యదర్శి గుజ్జ మోహన్ అన్నారు. నియోజకవర్గంలో చింతూరు కూనవరం వీఆర్పురం ఎటపాక మండలాలకు వరదనీరు ముంచెత్తడంతో మారుమూల గ్రామాల్లో గిరిజన పరిస్థితి చాలా దారుణంగా ఉందని రోజువారి కూలీలకు వెళ్లే గిరిజనులు పరిస్థితి అకమ్మ గోచరంగా ఉందని రెక్కాడితే గాని డొక్కాడని వీరి పరిస్థితి చూసి ఏ అధికారి చలించడం లేదని అధికారుల పర్యటన కేవలం రోడ్డు పాయింట్ కు వచ్చి పర్యటన చేసి వెళ్ళిపోతున్నారని తక్షణమే అధికారులు గుర్తించి ముంపు మండలాల్లో గిరి రైతులకి తక్షణమే నిత్యవసర సరుకులు అందజేయాలన్నారు.