ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా నేడు శనివారం రోజున సాయంత్రం 7 గంటలకు శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. మహిళలు కోలాటాలతో నృత్యాలు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముల్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది.