Parvathipuram, Parvathipuram Manyam | Aug 21, 2025
సత్వర గుర్తింపుతో క్యాన్సర్ బారి నుండి తప్పించవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు అన్నారు. NCD 4.0 లో బాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై వైద్యాధికారులు,వైద్య సిబ్బందికి గురువారం ఎన్జీఓ హోం లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గైనకాలజిస్ట్,డెంటల్ వైద్యులు క్యాన్సర్ స్క్రీనింగ్ పై పవర్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ అందించారు. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ క్యాన్సర్ లో ముఖ్యంగా నోటి,రొమ్ము,గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ లు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, క్షేత్ర స్థాయిలోనే సకాలంలో గుర్తించి చికిత్స అందించాలన్నారు.