నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో యూరియా సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య రైతుల పక్షాన నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం యూరియా సరఫరా లో నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలువలు లేవని చేతులెత్తేసింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పాలన చేస్తుందని ఆరోపించారు.