కూటమిలో ఐక్యత లోపించిందని రాజమండ్రి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామారావు అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా టీడీపీ జనసేన బిజెపి విడివిడిగా కార్యక్రమాలకు చేపట్టడమే దీనికి కారణం అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆదివారం రాజమండ్రిలో ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలోని ఋషికొండపై కట్టిన ప్యాలెస్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలన్నారు.