సెప్టెంబర్ 1 న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సూచికగా జనగామ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1న పార్టీ జెండా ఆవిష్కరణలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జోగు ప్రకాష్ సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి అధ్యక్షతన జరగగా కనకారెడ్డి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ వాయిదా పోరాట వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.