ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో ఘోర ప్రమాదం జరిగింది. మెడిసిన్ తీసుకొని వెళ్తున్న వృద్ధుడిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రమాద విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. మృతుడు భీమవరానికి చెందిన వ్యక్తి అని, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ను గురువారం సాయంత్రం పోలీసులు అధికారకంగా విడుదల చేశారు