చందూరు మండల కేంద్రం నుండి గ్రామ శివారులో ఉన్న నిజాంసాగర్ కెనాల్ వరకు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం రోడ్డు పనులు చేపట్టాలని చందూర్ గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. చందూర్ బస్టాండు నుండి గ్రామ శివారు వరకు నిబంధనల ప్రకారం 66 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. స్థానిక నాయకుల వారి అనుచరుల ప్రలోభాలకు లొంగకుండా నిబంధనల ప్రకారం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రస్తుతం కొందరి ప్రలోభాలకు లొంగి 33 ఫీట్ల వరకే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని దీనివల్ల భవిష్యత్తులో ఇరుకు రోడ్డు