అనంతపురంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభకు సెట్టూరు మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి వెళుతున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.