ఉస్మానియా యూనివర్శిటీలో చరిత్రలో ఇరవై ఏండ్ల తర్వాత, అడుగుపెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడేనని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు.పదేళ్లు అధికారంలో వున్న బీఆర్ఎస్ నాయకులు ఉస్మానియా యూనివర్శిటీ వైపు చూసిన పాపాన పోలేదని అయన ఆరోపించారు.జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలోని హరిత హోటల్ ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలుగు వర్షిణి,కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి అయన పరిశీలించారు.ఆ స్థలంలో బీఈడి,డీఈడి తోపాటు లా కాలేజ్,పారామెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను రూపొందించాలని అధికారాలకు సూచించారు.